దేవమాత ప్రార్థన | Litany of Blessed Virgin Mary

Advertisements

ఏలినవారా! దయ చూపండి
క్రీస్తువా! దయచూపండి
ఏలినవారా! దయ చూపండి

క్రీస్తువా! మా ప్రార్థన ఆలకించండి
క్రీస్తువా! మా ప్రార్థన ప్రకారము చేయండి

పరలోకమందుడెడు పితయైన సర్వేశ్వరా , మా మీద దయగా నుండండి స్వామి

లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా
లోకమును రక్షించిన పవిత్రాత్మ సర్వేశ్వరా
మహా పరిశుద్ధ ఏక త్రిత్వ సర్వేశ్వరా

పరిశుద్ధ మరియమ్మ,………………………………………. మాకొరకు వేడుకొనండి
సర్వేశ్వరుని యొక్క మాతా,
కన్యకల యొక్క పరిశుద్ధ కన్యకా,
క్రీస్తుని యొక్క మాతా,
దేవ వరప్రసాదము యొక్క మాతా,
పరిశుద్ధ మాతా,
మహా విరక్తిగా నుండెడు మాతా,
నిర్మలమైన మాతా,
కన్యత్వము చెడని మాతా,
స్నేహమునకు తగిన మాతా,
స్తుతికి పాత్రమైన మాతా,
మంచి ఆలోచన యొక్క మాతా,
సృష్టికర్త యొక్క మాతా,
రక్షకుని మాతా,
మహా వివేకము గల కన్యకా,
పూజ్యమైన కన్యకా,
స్తుతింపబడ యోగ్యమైన కన్యకా,
శక్తి గల కన్యకా,
దయ గల కన్యకా,
విశ్వాసము గల కన్యకా,
ధర్మము యొక్క అద్ధమా,
జ్ఞానము యొక్క ఆలయమా,
మా సంతోషము యొక్క కారణమా,
జ్ఞాన పాత్రమా,
మహిమకు తగిన పాత్రమా,
అత్యంత భక్తి యొక్క పాత్రమా,
దేవ రహస్యము గల రోజా పుష్పమా,
దావీదుని గోపురమా,
దంతమయమైన గోపురమా,
స్వర్ణమయమైన ఆలయమా,
వాగ్దత్తము యొక్క మందసమా,
మోక్షము యొక్క వాకిలీ,
ఉదయకాల నక్షత్రమా,
వ్యాథి గ్రస్తులకు ఆరోగ్యమా,
పాపాత్ములకు శరణమా,
కష్టపడెడు వారలకు అదరువా,
క్రీస్తువల సహాయమా,
సన్మనస్కుల యొక్క రాజ్ఞీ,
పితరుల యొక్క రాజ్ఞీ,
దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞీ,
అపోస్తులుల యొక్క రాజ్ఞీ,
వేదసాక్షుల యొక్క రాజ్ఞీ,
స్తుతియుల యొక్క రాజ్ఞీ,
కన్యస్త్రీల యొక్క రాజ్ఞీ,
సకల పునీతుల యొక్క రాజ్ఞీ,
జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞీ,
మోక్షమునకు గోనిపోబడిన రాజ్ఞీ,
పరిశుద్ధ జపమాల రాజ్ఞీ,
కుటుంబము యొక్క రాజ్ఞీ,
సమాధానము యొక్క రాజ్ఞీ,

లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా పాపములను మన్నించండి స్వామి!

లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి!

లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా మీద దయగా నుండండి స్వామి!

యేసు క్రీస్తు దివ్య వాగ్దాత్తములకు మేము ప్రాప్తులమగునట్లు!
సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా! మా కొరకు ప్రార్ధించండి
.

ప్రార్దించుదము

జగద్రక్షకుడైన జేసువా ! మీ స్లీవ క్రింద నిలిచియుండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి యనుగ్రహమును దయచేసి దేవరవార కాలప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలిసికొనినటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండేడు భాగ్యము మాకెప్పటికిని ప్రాప్తింపచేయ నవధరించండి. స్వామి. ఆమెన్

Advertisements

Discover more from Nelson MCBS

Subscribe to get the latest posts sent to your email.

Leave a comment